నిత్య దీపావళి
త్రేతా యుగంలో నిత్య కల్యాణం పచ్చతోరణం
శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష
ద్వాపర యుగంలో వెలుగుల వెల్లువ
క్రిష్ణం వందే జగత్గురుం
మరి ఇప్పుడు,
కలియుగ శ్రీవేంకటేశ్వరుని సాక్షిగా
ప్రతిరోజు నిప్పుతో చెలగాటంపవర్ కట్ల పుణ్యమా అని,
లో వ్లోటేజి తో భగ్గుమన్న విద్యుత్ పరికరాలు
తారాజువ్వల్లా నింగికి యెగసిన నిత్యావసర ధరలు
ఇంధనం క్రుత్రిమ కరువు వలన కాలుతున్న జేబులు
ఏ మూల చూసినా బాంబుల భయం
దేశం ఉగ్రవాదుల చేత్తుల్లో ఆట వస్తువైపోతే,
మన రాజకీయ నాయకులు, కుంభకొణాల్తో సేద తీరుతుంటే
ఇంతలో రంగు పూసుకున్న కళాకారులు, అసలు రంగులు బయటపెడుతుంటే
మన మనసులకు భ్రమ కల్పించి,దారి తప్పిస్తుంటే,
సగటు మనిషికి, దీపావళి మాయమై, ఇంటిలో పొయ్యి వెలిగించే వీలులేక
బతికే స్థొమత లేక విలవిల లాడు తుంటే,
స్వామీ,
ఇన్ని చూస్తూ ఎలా వున్నావు?
నీ పేరు తో మోసం చేస్తూ వుంటే,
ఎలా వారిని వదిలిపెడు తున్నావు?
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన రోజు కావాలి
మనం కోరుకొనే పండుగ.
దీపావళి మళ్ళీ మళ్ళి రావాలి.
No comments:
Post a Comment