ఎందరో మహానుభావులు


జీవితం అమూల్యం ,చెయ్యకు దానిని మాలిన్యం

చెల్లిస్తున్నాము మూల్యం, ధన దాహం తో


ధనమేరా అన్నిటికి మూలం అన్నట్టు,


దీని మూలాలు మనకి తెలుసు,కాని యెందుకీ మౌనం?

మనం ఓడిపొయామా అనే భావన కలిగింది కదూ!

కపట వేష ధారులకు పట్టం కట్టి, మనం పట్టించు కోక పోతే,


వారి లక్ష్యం డబ్బే అయితే, దేశ మూలాలకు చేస్తారు వారు హాని ,


మన శత్రువులు బయట లేరు, మనలోనే వున్నారు

వారిని గుర్తించి, మనిషి విలువ తెలియ చెయ్యి,


మంచి మార్గంలోకి తీసుకురా-

వీలైతే నువ్వే మహాత్ముల బాటలో నడచి చూప్పించు,
నవ చైతన్యంతో, మట్టిలో మాణిక్యంలా.



ఓ నాయకుల్లారా!


జగము లోని ధనమనే మాయా ముసుగును తీసి చూడండి,


"ధన్నాన్ని సాగదీస్తే దానమే అవుతుంది.



"ధనం" "దానం"


ఈ చిన్ని సూక్ష్మం గ్రహించు జీవితమే పరమార్ధమౌతుంది.

No comments: